గోపాలపురం మండలం దొండపూడిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న తల్లీకుమార్తెలు ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో మరో ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రగాయలైన వారిని స్థానికులు వైద్యం కోసం రాజమండ్రి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతులు పోలవరం మండలం బండార్లగూడెంకు చెందిన కాంతమ్మ(45), గన్నమ్మ(75)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.