రానున్న దీపావళి పండుగ పురస్కరించుకుని అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తే చర్యలు తప్పవని జగ్గంపేట సీఐ వైఆర్ కె. శ్రీనివాస్ తెలిపారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ ఉంచరాదన్నారు. ఇంటి పరిసరాల్లో బాణసంచా తయారు చేసిన, నిల్వఉంచిన చర్యలు తప్పవన్నారు. బాణసంచా అక్రమ తయారీపై 9440796529 నెంబర్ కు లేదా కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి ఎస్ఐలకు తెలియజేయాలని కోరారు.