సారా బట్టిని ధ్వంసం చేసిన పోలీసులు

81చూసినవారు
జగ్గంపేట మండలం జె. కొత్తూరు శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా బట్టి పై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. జగ్గంపేట ఎస్సై టి రఘునాధరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని డ్రమ్ములలో నిలవ ఉంచిన 600 లీటర్ల బెల్లపు ఉటను ధ్వంసం చేసినట్లు ఎస్సై తెలిపారు. సారా తయారీకి పాల్పడుతున్న గూడూపు వెంకటరమణ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్