ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి, ప్రజాస్వామిక వాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్టీ యూనియన్లు, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు వివిధ ప్రజాసంఘాలు బలపరిచిన గంధం నారాయణరావును గెలిపించాలని ఎస్టీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. సాయిశ్రీనివాసు పిలుపునిచ్చారు. కాకినాడలో మంగళవారం ఎంఎల్సీ నామినేషన్ సందర్భంగా క్లబ్ ఆవరణలో ఉపాధ్యాయసంఘాలు, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు.