కాకినాడ: నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

59చూసినవారు
కాకినాడ: నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా.. జిల్లాలో శాంతిభద్రతలు, మహిళలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టిసారించి నిరోధించాలని సూచించారు. దీపావళి పండుగ నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్