ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యన్ బి ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం నాయకులు కార్తీక వన సమారాధన ఆహ్వాన పత్రికను కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుచేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా చైర్మన్ సుందరపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 24వ తేది ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కాకినాడ లేడీస్ క్లబ్ లో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.