రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ట్రూ అప్ చార్జీలు ఇతర రూపాల్లో వేస్తున్న విద్యుత్ చార్జీల భారాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ 37వ డివిజన్ సుందరయ్య భవన్ వీధిలో విద్యుత్ బిల్లులు భోగి మంటలో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ గత ప్రభుత్వం అవలంభించిన విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుందన్నారు.