చేపల వేటకు వెళ్లి అల్పపీడన కల్లోలిత సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ సంస్థల సహకారంతో సురక్షితంగా తీరానికి చేర్చామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి గురువారం కాకినాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల23వ తేదీన కాకినాడ పర్లోపేటకు చెందిన ధర్మరాజు పెంటయ్య, నాని, సతీష్ కలిసిపడవలో చేపల వేట నిమిత్తం బోటులో వేటకెళ్ళారని వారు సముద్రంలో చిక్కుకోవడంతో రక్షించామన్నారు.