కరప పరిధిలోని కొరుపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. 64 పందేల్లో 33 మ్యాజిక్ ఫిగర్ దాటిన వారికి మహీంద్రా తార్ బహుమానంగా పెట్టారు. బుధవారం సాయంత్రానికి 33 పందేలను డేగల నాగేంద్ర గెలుచుకున్నారు. దీంతో ఆయనను విజేతగా ప్రకటించారు. గత ఏడాది బుల్లెట్ వచ్చిందని, ఈ ఏడాది మహీంద్రా తార్ బహుమతిగా వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.