ఆత్రేయపురం: కన్నుల పండుగగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు

85చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మూడవరోజు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ మొదలు నవనీత హారతి, పుణ్యాహవాచనం , ప్రధాన, నవగ్రహ హోమాలు అనంతరం స్వామి వారు కోదండరామ అలంకరణతో హనుమద్వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు వేలాదిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు

సంబంధిత పోస్ట్