తెలుగుదేశం పార్టీ నేతల సేవా దృక్పథం అభినందనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి చెందిన టిడిపి నేతలు వరద బాధితులకు తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.40 వేల రూపాయల నగదును సత్యానందరావుకు అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు దొంగ సత్యనారాయణ, లాలం శ్రీనివాస్ ను బండారు అభినందించారు.