విద్యతోనే సకలం సాధ్యమవుతుందని పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధనకు మోడల్ పేపర్లు ఉపకరిస్తాయని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గంగాధర్ తెలిపారు. శుక్రవారం చాగల్లు మండలం చంద్రవరంలో పదవ తరగతి విద్యార్థులకు యూటీఎఫ్ మోడల్ పేపర్ పుస్తకాలను అందజేసి ఆన్నారు. దాతలు పీజీటీ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమేష్ ల ఆర్థిక సహకారంతో పంపిణీ చేసారు. పాఠశాల సీనియర్ గణిత ఉపాధ్యాయులు శ్రీనివాస్, యూటీఎఫ్ మండల సహా అధ్యక్షులు సత్తి రాజు పాల్గొన్నారు.