కొవ్వూరు డివిజన్ లో సంక్రాంతి సందర్భంగా కోడిపందాలపై ప్రత్యేక నిఘ ఉంచాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. డివిజన్ స్థాయి అధికారులతో కోడిపందాలపై శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోడిపందాల బిర్లు ఏర్పాటు చేస్తున్న వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సూచించారు. పోలీస్ రెవెన్యూ అధికారులతో ఆర్డిఓ సమీక్షించారు.