కంప్యూటర్ ఆపరేటర్ ను కాటేసిన పాము

55చూసినవారు
కంప్యూటర్ ఆపరేటర్ ను కాటేసిన పాము
మండపేట మండలం ఏడిద గ్రామపంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న చల్లా ఆది సూర్యనారాయణ మూర్తిని పాము కాటు వేసింది. విధి నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం కంప్యూటర్ ఆన్ చేసి కీబోర్డు తీస్తుండగా అక్కడే దాగి ఉన్న పాము ఆయన చేతిని కాటు వేసింది. మూర్తి కేకలు వేయడంతో పంచాయతీ సిబ్బంది పామును హత మార్చారు. వెంటనే ఆయన్ని మండపేట సిహెచ్సికి తరలించగా వైద్యులు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు.

సంబంధిత పోస్ట్