అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుమిల్లి గ్రామంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆ గ్రామంలో వేగుళ్ళ కు మెజార్టీ వస్తే తాను రాజకీయాల్లో నుండి తప్పుకుంటానని చెప్పారని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట టిడిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తోట తనపై చేసిన ఆరోపణల పై వివరణ ఇచ్చే ముందు తోటకు ఓ ప్రశ్న వేస్తున్నానని దానికి సూటిగా సమాధానం చెప్పాలన్నారు