ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గురువారం మురమళ్ళలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. పల్లిపాలెం, చెయ్యేరు ఆగ్రహారంలలో సామాజిక పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే దాట్ల పాల్గొన్నారు. సమర్థ పరిపాలనకు రాష్ట్రంలో పించన్లు పంపిణీని మచ్చుతునకగా చెప్పుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుల సాయి, జంపన బాబు, ఏలూరి మూర్తి, గంజా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.