కాట్రేనికోన మం. బలుసుతిప్ప ఎస్సీ పేటలో తాగునీరు సక్రమంగా రావడం లేదని స్థానికులు బుధవారం ఆవేదన వ్యక్తం చేసారు. మూడు నెలల నుంచి తాగునీరు సక్రమంగా రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వేసవి నేపథ్యంలో తాగు నీరు ఇవ్వకపోతే తమ దాహార్తి ఎలా తీరుతుందని ప్రశ్నించారు. అధికారులు స్పందించి తమకు తాగునీటిని అందించాలని వారు కోరుతున్నారు.