ఏటిగట్టు రోడ్డు కుంగుతోంది..

67చూసినవారు
వృద్ధగౌతమి గోదావరి కుడిగట్టు కుండ లేశ్వరం పరిధిలో ఏటిగట్టు రోడ్డు మళ్లీ కుంగుతోంది. ఇటీవల సుమారు 50 మీటర్ల మేర ఈ రోడ్డు కుంగిపోగా కలెక్టరు స్వయంగా పరిశీలించి వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు 40 మీటర్ల మేర రోడ్డు బీటలుతీసి 30 మీటర్ల మేర కుంగింది. మరింత కుంగిపోకుండా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్