ఐ. పోలవరం మండలంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత ఇంజరం పోలీస్ స్టేషన్లో దేశ రక్షణలో అమరులైన ఎందరో సైనికులు, పోలీసులు స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. జడ్పీహెచ్ హైస్కూల్ విద్యార్థులు పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.