సంక్రాంతి పండుగలో గోదావరి వాసులు కొత్త అల్లుడికి చేసే మర్యాద ఓ రేంజ్ లో ఉంటుంది. మామిడికుదురు మండలం నగరంలో కొత్త అల్లుడికి మంగళవారం 270 రకాల పిండి వంటలతో మెగా విందు ఏర్పాటు చేశారు. నగరం గ్రామానికి చెందిన కుక్కల వెంకటేశ్వర్లు కుమార్తె మౌనికకు మూడు నెలల క్రితం శ్రీరామ్ తో వివాహమైంది. అతడికి అత్తవారింట సరికొత్తగా మెగా విందు ఏర్పాటు చేశారు. కొత్త అల్లుడికి చేసిన విందు ఔరా అనిపిస్తోంది.