చౌకధరల దుకాణాలు, వంట గ్యాస్ సరఫరా వంటి కార్యకలాపాలు నిర్వహించే యానాం కో ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ పాలకవర్గ ఎన్నికల నామపత్రాల ప్రక్రియ సోమవారం జరగనుంది. హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న ఎన్నికలకోసం యానాం విష్ణాలయం వీధిలోని సంస్థ కార్యాలయంలో ఉ. 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామపత్రాలు దాఖలుకు సమయాన్ని నిర్దేశించారు. స్టోర్స్ లో 3, 526 మంది సభ్యులు ఉండగా 9 మంది డైరెక్టర్లను సభ్యులు ఎన్నుకోవాల్సిఉంది.