యానాం: రోడ్లు, డ్రైన్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

68చూసినవారు
యానాంలోని అయ్యన్న నగర్లో రోడ్లు, డ్రైన్ల పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, డ్రైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని వాటి మరమ్మతుల కోసం సుమారు రూ. 20 లక్షలతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలన అధికారి ఆర్. మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్