నిడదవోలులో అమిత్‌షా చిత్రపటం దహనం

71చూసినవారు
పార్లమెంట్‌లో అంబేడ్కర్‌పై హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం కేవీపీఎస్ చర్చ్ పేట యూత్ ఆధ్వర్యంలో నిడదవోలులో అమిత్ షా చిత్రపటంపై చెప్పులతో కొడుతూ దహనం చేశారు. అమిత్ షా వెంటనే పదవికి రాజీనామా చేయాలని జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. చర్చిపేట యూత్ సభ్యులు అమిత్ షాక్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్