నిడదవోలు పట్టణంలో అసంపూర్ణంగా వదిలేసిన తహశీల్దార్ కార్యాలయ భవనాన్ని తక్షణమే నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని కోరుతూ పట్టణ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ భవన నిర్మాణానికి గతంలో సుమారు 30 లక్షల రూపాయలు మంజూరు చేశారని కొంతమేర నిర్మాణం పూర్తి చేసి వదిలేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కన్వీనర్ జువ్వల రాంబాబు అన్నారు. తక్షణమే నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.