ఇటీవల డిసెంబర్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంగా నిడదవోలు యోగ మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ వేడుకలను ఈ నెల 21న ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద నిర్వహించనున్నట్లు యోగా గురువు సానెపు వెంకట సుబ్బారావు శుక్రవారం తెలిపారు. మానసిక ప్రశాంతతకు సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.