సామర్లకోట మండలం పనసపాడు గ్రామం పల్లపు వీధిలో యెహోవాయీరే ప్రార్థన మందిరంలో ఆదివారం సాయంత్రం చర్చి వార్షికోత్సవం, క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పాటలు పాడారు. పాస్టర్ ఎన్. జయశీల్ క్రిస్మస్ సందేశం అందించారు. పాస్టర్ ఎన్. ప్రభుదాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నొక్కి ఛాయా, ఏంజెల్ తో పాటు అధిక సంఖ్యలో సంఘస్తులు పాల్గొన్నారు.