విధియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆర్డీవో కె. శ్రీరమణి అన్నారు. వినియోగదారుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా పెద్దాపురం సోమవారం ఆర్డీవో కార్యాలయంలో వినియోగదారుల చట్టాలపై జరిగిన అవగాహన సదస్సుకు ఆమె అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి వినియోగదారుల చట్టాలపై అవగాహన పెంచవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.