విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా వైసీపీ పోరుబాట పోస్టర్ ను పెద్దాపురం వైసీపీ ఇన్ చార్జ్ దవులూరి దొరబాబు ఆవిష్కరించారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఈ పోస్టర్ ను విడుదల చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా డిసెంబర్ 27న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.