గొల్లప్రోలు మండలంలో మంగళవారం నుంచి ఉచిత పశుఆరోగ్య శిబిరాలు ప్రారంభమవుతాయని పశుసంవర్థకశాఖ ఏడీ డాక్టర్ శ్రీని వాసరావు తెలిపారు. ఈ మేరకు ఉచిత పశుఆరోగ్య శిబిరాల కరపత్రాలను చేబ్రోలులో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు పశువైద్యురాలు హిమజ, సిబ్బంది పాల్గొన్నారు.