పిఠాపురం మహారాజా ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపు నిచ్చారు. శనివారం సూర్యారావు బహుద్దూర్ ఆధ్వర్యంలో మహారాజా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గతంలో పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మహారాజా 500 ఎకరాలు ఇస్తే ఆ భూమి కబ్జాకు గురైందని, దానిని సంరక్షించి రూ. 50 లక్షల ఆదాయానికి తీసుకొచ్చామన్నారు. ఆయన పేరుతో ఉచిత పాలిటెక్నిక్ విద్యను అందించడం జరుగుతుందని వర్మ తెలిపారు.