పిఠాపురం మండలం భోగాపురంలో కొణిదెల పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాటక పోటీలు జనవరీ 16, 17, 18, 19వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ సౌజన్యంతో జాతీయస్థాయి నాటక పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు ప్రత్యేక ఆహ్వానితులుగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను ఆహ్వానిస్తున్నట్టు బుధవారం ఆహ్వాన పత్రిక అందించారు.