జీఓ నంబర్ 85కు వ్యతిరేకంగా నిరసన

63చూసినవారు
జీఓ నంబర్ 85కు వ్యతిరేకంగా నిరసన
ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 85కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాచపల్లి, శాంతిఆశ్రమం, పెద్దిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీఓతో తమ మూడేళ్ల సర్వీసుకు అర్థం లేకుండా పోయిందన్నారు. కోవిడ్ సమయంలో తమ జీవితాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించామన్నారు.

సంబంధిత పోస్ట్