రౌతులపూడి ఎంపీడీవోగా జి. శివరామకృష్ణయ్య

54చూసినవారు
రౌతులపూడి ఎంపీడీవోగా జి. శివరామకృష్ణయ్య
ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల ఎంపీడీవోగా జి. శివరామకృష్ణయ్య శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. శంఖవరం ఎంపీడీవోగా పనిచేసి రౌతులపూడి మండలం బదిలీఫై వచ్చారు. ఈ సందర్భంగా శివరామకృష్ణయ్య మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్