రాజమహేంద్రవరం లాలాచెరువు సెంటర్ లో ఆదివారం శెట్టిబలిజ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో శెట్టిబలిజ జాతి వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణకు గీత కులాలందరూ పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా రావాలని రాష్ట్ర మాజీ చైర్మన్ పాలిక శ్రీను శనివారం కోరారు. ఆయన మాట్లాడుతూ శెట్టిబలిజ జాతి కోసం ఆయన ఆస్తులు సైతం దానధర్మాలు చేసి ఎంతోమంది పేద జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.