అక్టోబర్ 1నుండి నీటి సరఫరా నిలిపివేత

82చూసినవారు
అక్టోబర్ 1నుండి నీటి సరఫరా నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా విభాగం సత్య సాయి పథకంలో.. పురుషోత్తపట్నం హెడ్ పంప్ హౌస్ నుండి పైపులైన్ల ద్వారా ఐదు మండలాలకు సరఫరా అవుతున్న గోదావరి త్రాగునీరు అక్టోబర్ 1 నుండి నిలిపివేసి, నిరవధిక సమ్మెకు వెళుతున్నట్లు కార్మిక సంఘ నాయకులు కట్టమూరి వీరబాబు ఓ ప్రకటనలో తెలియజేశారు. కార్మికులకు 17 నెలల నుండి సంబంధిత కాంట్రాక్టర్ జీతం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లను ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సంప్రదిస్తే బిల్లులలో జాప్యం జరుగుతుందన్నారు.ఈ సమ్మెకు సిఐటియు అనుబంధ ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్