అక్రమంగా సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

57చూసినవారు
అక్రమంగా సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
అక్రమంగా సారా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రాజమండ్రి రూరల్ పరిధిలోని బొమ్మూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కవలగొయ్యి ప్రాంతానికి చెందిన పీ. వీ జానకిరామ్ తన ఇంటి వద్ద సారా విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి వద్ద 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్