దీపావళి పండుగను పురస్కరించుకుని జనావాసాలు మధ్య ఎవరైనా బాణాసంచా సామాగ్రి తయారీ, నిల్వ చేసిన తమకు సమాచారం ఇవ్వాలని ధవలేశ్వరం సీఐ గణేష్ పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్ వద్ద సీఐ మాట్లాడుతూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన స్థలాల్లో తప్ప ఇంకెక్కడా అమ్మకాలు సాగించకూడదన్నారు. ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా దీపావళి పండుగను జరుపుకోవాలని సూచించారు.