చంద్రబాబు నిర్వాహకం వల్లే పోలవరం ప్రాజెక్ట్ డ్యాంకు నష్టం వచ్చిందని కేంద్ర కమిటీ నిర్ధారించినట్లు మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని మరుగున పడేసేందుకు పోలవరానికి సంబంధించిన ఫైల్స్ దగ్ధమైనట్లు నాటకం ఆడి, అమాయకులైన ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేశారని అన్నారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చడం కోసం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు.