తూ. గో జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలోని డీఎల్‌ఎస్‌ఎ కార్యాలయంలో శనివారం పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ బి. పద్మ మాట్లాడుతూ లైంగిక వేధింపులు, అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తప్పవని అన్నారు. ప్రతీ కార్యాలయంలో ఉన్న ఫిర్యాదుల కమిటీని సంప్రదించాలన్నారు.