తూ. గో: జిల్లాలో 98. 41 శాతం పెన్షన్లు పంపిణీ

73చూసినవారు
తూ. గో: జిల్లాలో 98. 41 శాతం పెన్షన్లు పంపిణీ
తూర్పుగోదావరి జిల్లాలో 98. 41% మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో 2, 39, 021 మంది లబ్ధిదారులు ఉండగా వారిలో 2, 35, 212 మందికి పెన్షన్లు అందించడం జరిగిందన్నారు. కోరుకొండలో 98. 84% రాజమండ్రి అర్బన్‌లో 98. 74% రంగంపేటలో 98. 7% కొవ్వూరు అర్బన్‌లో 98. 69 శాతం రాజానగరంలో 98. 65% పెన్షన్లు పంపిణీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్