ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. శనివారం కోరుకొండలోని జనసేన పార్టీ కార్యాలయంలో వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల నుంచి ఎమ్మెల్యే ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే ఆ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.