రాజానగరం మండలం నరేంద్రపురం, నందరాడ గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ అధికారి ఎస్. కె ఇమామి ఖాసిం ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. దాళ్వా సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. పంట బీమా పథకమును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించబడిందని, కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.