రామచంద్రపురం పట్టణంలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో దేశ విభజన భయానక స్మృతి దివాస్ సందర్భంగా బుధవారం రాత్రి కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలను స్మరించుకుంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కళ్యాణ్, పట్టణ అధ్యక్షుడు కేశవ రాఘవేంద్ర, కె. గంగవరం మండలం అధ్యక్షుడు పసుమర్తి శ్రీ రామ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.