సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక గ్రామానికి చెందిన కృపా మహాలక్ష్మి (21) శనివారం తెల్లవారుజామున ప్రసవ నొప్పులు రావడంతో ఆమె బంధువులు 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. రాపాక స్పందన వెంటనే అప్రమత్తమై, చాకచక్యంగా ప్రసవాన్ని సఫలీకరించారు. ఆ తల్లి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని స్పందన, పైలట్ నాగేష్ తెలిపారు.