మద్యం విక్రయం.. వ్యక్తి అరెస్ట్

76చూసినవారు
మద్యం విక్రయం.. వ్యక్తి అరెస్ట్
కాట్రేనికోన మండలం గోరగనమూడిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అవినాష్ శుక్రవారం తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో గురువారం రాత్రి దాడిచేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద నుంచి 39 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్