మలికిపురం: బాణాసంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి

70చూసినవారు
మలికిపురం: బాణాసంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి
దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్లు, విక్రయించే దుకాణాలకు తప్పనిసరిగా అనుమతి ఉండాలని మలికిపురం ఎస్ఐ సురేశ్ తెలిపారు. శనివారం ఎస్ఐ మలికిపురంలో మాట్లాడుతూ. బాణాసంచా తయారీ, విక్రయాలు చేసే వారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్