రాజోలు నున్నవారి బాడవ నందు వరద ప్రభావ ప్రాంతాలను గురువారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ వరద పరిస్థితులపై అధికారులతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. ఆయన వెంట తహశీల్దార్ ప్రసాద్, ఎస్సై రాజేష్ ఉన్నారు.