కరవాకలో ముందుకు వచ్చిన సముద్రం

78చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మామిడికుదురు-మలికిపురం మండలాల సరిహద్దు ప్రాంతం కరవాకలో గురువారం సముద్రం ముందుకు వచ్చింది. అలలు ఎగసిపడుతూ సముద్రం నీరు పొలాలలోకి వచ్చిందని స్థానిక ప్రజలు అంటున్నారు. సముద్రం ఇలా ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు అందోళన చెందుతున్నారు. తుఫాను సమయంలో ఇలా సముద్రం ముందుకు రావడం సహజమే అని మరికొంతమంది స్థానికులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్