కోటనందూరు మండలంలోని కొత్తకొట్టాం గ్రామంలో గల 5వ వార్డులో డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తుంది. దీంతో మురుగునీటిలోనే నడవాల్సి వస్తుందని కాలనీ వాసులు వాపోతున్నారు. భరించలేని దుర్వాసన వస్తుందని, దోమలకు నిలయమై రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. డ్రైనేజీలు నిర్మించాలని పలుమార్లు విన్నవించినా అధికారులు స్పందించడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.