తుని: ప్రమాదంలో గాయపడ్డ డ్వాక్రా వీవోఏ మృతి

60చూసినవారు
తుని: ప్రమాదంలో గాయపడ్డ డ్వాక్రా వీవోఏ మృతి
తుని మండలం డి. పోలవరం గ్రామానికి చెందిన ఎన్. ఆదినారాయణమ్మ (22) కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. మృతురాలు తునిలోని డ్వాక్రా కార్యాలయంలో వీవోఏగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గండి వద్ద ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటిన బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్